భారతీయ సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం. రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఎన్నో అనారోగ్యాలకు ఆయుర్వేద చిట్కా వైద్యం ఎంతగానో ఉపకరిస్తుంది. వీటివల్ల ప్రతి చిన్న సమస్యకూ వైద్యుడిని ఆశ్రయించే ఇబ్బందీ తప్పుతుంది. అలాంటి కొన్ని చిట్కాలు..

  • మూత్ర కోశ సమస్యలతో బాధపడే వారు ముల్లంగిని ఆకులతో సహా కూరగా చేసుకుని లేదా మెత్తగా రుబ్బి రసం తీసి మంచి గుణం కనిపిస్తుంది.
  • కిడ్నీ నొప్పి బాధితులు రోజూ రెండుపూటలా అరచెంచా చొప్పున పచ్చి మెంతులు లేదా పెరుగులో నానబెట్టిన మెంతులు తింటే నొప్పి తగ్గుతుంది.
  • కాటరాక్ట్, గ్లూకోమా వల్ల కంటిచూపు దెబ్బ తిన్నవారు 10 మిల్లీలీటర్ల చొప్పున తెల్ల ఉల్లిపాయ రసం, అల్లం రసం, నిమ్మ రసం కలిపి దాన్ని 3 చెంచాల తేనెతో కలిపి సమస్య తీవ్రత తగ్గి కంటి చూపు మెరుగుపడుతుంది.
  • చిగురు వాపు, ఇన్ఫెక్షన్ తదితర కారణాల వల్ల పండ్ల వెంట రక్తం కారుతుంటే 1 ఉల్లిపాయ, ఉప్పు కలిపి నూరి ఆ మిశ్రమంతో దంతాలను, చిగుళ్ళను రుద్దితే వెంటనే రక్తం కారటం ఆగిపోతుంది.
  • 4 పుదీనా కట్టలు, 10 గ్రాముల చొప్పున మిరియాలు,శొంఠి కలిపి మెత్తగా నూరి బఠాణీ గింజంత గుళికలు చేసి నీడలో ఆరబెట్టాలి. వీటిని డబ్బాలో నిల్వ చేసుకొని రోజుకు 3 (పూటకొకటి) చొప్పున 3 నెలల పాటు తీసుకుంటే ఎంతటి ఊబకాయమైనా తగ్గుతుంది.
  • మూత్రనాళంలో రాళ్లు ఏర్పడి సమస్యగా మారినప్పుడు 100 గ్రాముల ఉల్లిపాయల్ని బాగా చితక్కొట్టి అర లీటరు నీటిలో ఉడికించాలి. ఆ నీటిని చల్లార్చి రోజుకు 3 సార్లు చెంచా చక్కెర కలిపి తాగితే మూత్రనాళపు రాళ్లు కరిగిపోతాయి.
  • కాలిన గాయాలకు మగ్గిన అరటిపండు గుజ్జు రాస్తే మంట తగ్గటమే గాక గాయం త్వరగా నయమవుతుంది.
  • తలలో పేలు పడితే 5 చెంచాల గోరువెచ్చని కొబ్బరి నూనెలో 4 కర్పూరం బిళ్ళలు అరగదీసి తలకు పట్టిస్తే పేల బెడద వదిలిపోతుంది.
  • జుట్టు రాలటం ఆగాలంటే 2 చెంచాల సగ్గుబియ్యాన్ని గంట సేపు నీటిలో నాననిచ్చి 5 నిమిషాలు ఉడికించి అందులో కాస్త చక్కెర, ఉప్పు కలిపి 10 రోజులు తింటే జుట్టు రాలటం తగ్గుతుంది.
  • రాత్రి నిద్రకు ముందు పాదాలను కడిగి తుడిచి కొబ్బరినూనె రాస్తుంటే ఎంతటి పగిలిన పాదాలైనా వారం రోజుల్లో మెత్తబడతాయి. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE