కొందరికి అరికాళ్లలో ఆనెల సమస్య ఉంటుంది. సాధారణంగా ఆనెల వల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు గానీ నడకలో మార్పు వస్తుంది. ఒట్టికాళ్లతో పొలాల్లో తిరగటం, బిగుతుగా లేదా వదులుగా వున్న చెప్పులు ధరించడం వలన కలిగే ఒరిపిడి, సాక్స్ లేకుండా షూస్ వేసుకోవడం, చెప్పులులేకుండా మిషన్ లేదా వాహనాలు నడపటం వల్ల ఆనెలు వస్తాయి. ఆవగింజంతగా మొదలై కంది గింజంత అయ్యే ఆనెలను అవగాహన లేమితో కొందరు బ్లేడుతో కోసే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇలా చేయటం వల్ల ఆనెలు మరింత పెరగటమే గాక ఒక్కోసారి సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే కొన్ని చిట్కాల సాయంతో వీటిని శాశ్వతంగా నివారించవచ్చు. 

చిట్కాలు

 • పది రోజులపాటు రోజూ నిద్రకుముందు ఆనెపై కలబంద గుజ్జు పూసి గాలి ఆడకుండా ప్లాస్టర్ వేస్తే మంచిఫలితం ఉంటుంది.
 • వారం పాటు రోజూ ఇనుపమూకుడులో దాల్చిన చెక్కను మాడ్చి బూడిదచేసి, ఆ చిటికెడు బూడిదలో గురి గింజంత నీరు సున్నం కలిపి ఆనెలకు పట్టిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
 • తులసి ఆకుల గుజ్జును ఆముదంలో రంగరించి ఆనె మీద రాసి 2 గంటల తర్వాత కడగాలి. ఇలా 2 వారాలు చేస్తే మార్పు కనిపిస్తుంది.
 • వారం రోజుల పాటు వెల్లుల్లి రెబ్బలు నూరి ఆనెల మీద పెట్టి కట్టుకడితే బాక్టీరియా నశించి ఆనెలు మాయమవుతాయి.
 • ఆనెల మీద చుక్క చొప్పున వెనిగర్‌ వేసి రుద్ది అక్కడ కొద్దిగా దూది పెట్టి కట్టు కడుతుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
 • నెలరోజులపాటు పచ్చి జీడిపప్పు గుజ్జును ఆనెలకు రాసి కడుగుతుంటే క్రమంగా ఆనెలు తగ్గుతాయి
 • ఎండు మామిడి ఆకుల భస్మంలో నీరు కలిపి మెత్తగా చేసి ఆనెల మీద రుద్దినా మంచి గుణం కనిపిస్తుంది. 

నివారణ

 • మెత్తని చెప్పులను వాడాలి . షూ లోపల వేళ్ళు కదిలించే వెసులుబాటు ఉండేలా చూసుకోవాలి.
 • ఇతరుల చెప్పులు వాడకూడదు. కెమికల్స్ కలిసివున్న చెప్పులు అసలేవద్దు.
 • పాదరక్షలు లేకుండా రాళ్ళలో నడవకూడదు.
 • ఎప్పటికప్పుడు కాళ్ళను శుభ్రంగా కడుక్కోవాలి.Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

అన్నదానం ఎందుకు?

   పలు సందర్భాల్లో చాలామంది అన్నదానము చేయటం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే 

MORE