ఏదైనా తినేటప్పుడు ఒలికిపోయినా లేదా రోడ్డుమీద వెళ్ళేటప్పుడో బురద వంటివి పడినప్పుడో బట్టల మీద మరకలు పడటం సహజమే. ఇక రోజంతా ఆటపాటల్లో మునిగి తేలే పిల్లల బట్టలైతే మరకల్లేకుండా ఉండటం అసాధ్యం. ఉతికితే పోయే ఈ మరకల మొదలు రంగు మరకల వరకు వదిలిపోయేలా చేసే కొన్ని చిట్కాలను తెలుసుకుందాం. 

 • బట్టలమీద పెయింట్ మ‌ర‌క‌లు పడితే ఆల్క‌హాల్ లేదా హ్యాండ్ శానిటైజ‌ర్ వాడాలి. ఈ రెండింటిలో దేన్న‌యినా మ‌ర‌క‌ల మీద రాసి 10 నిమిషాలు ఆగాక మ‌ర‌క‌ల‌ను రుద్దితే పెయింట్ కొద్దికొద్దిగా వదిలిపోతుంది. ఇంకా పెయింట్ ఉంటే మరోమారు చేస్తే సరి.
 • బట్టలమీద ఇంక్ మ‌ర‌క‌లు పడితే వాటిపై హ్యాండ్ శానిటైజ‌ర్‌ రాసి పాత టూత్‌బ్ర‌ష్‌తో బాగా రుద్దాలి. తర్వాత బేకింగ్ సోడా రాసి పావుగంట ఆగి బట్టలను వేడి నీటిలో ఉతికితే ఇంకు మరక పూర్తిగా తొలగిపోతుంది. లేదా పుల్లటి పెరుగులో కాసేపు నానబెట్టి తర్వాత ఉతికినా చాలు.
 • బట్టలమీద బురద, మట్టి మరకలు పడితే కొద్దిగా బ్లీచింగ్ పౌడ‌ర్‌ తీసుకొని నీరు కలిపి మరకలమీద రాసి ఉతికితే క్లీన్ అవుతాయి.
 • బట్టలమీద కెచ‌ప్ మ‌ర‌క‌లు పడితే కొద్దిగా వైట్ వెనిగ‌ర్‌ రాసి టూత్ బ్ర‌ష్‌తో రుద్ది డిట‌ర్జెంట్ పౌడ‌ర్‌తో ఉతికితే చాలు.
 • ఒకవేళ బట్టలకు చాక్లెట్ అంటితే ముందుగా మొద్దు బారిన చాకుతో మరక మీద రుద్ది ఎండిన చాక్లెట్ తొలగించాలి. తర్వాత దానిపై అమ్మోనియా వేసి చేత్తో లేదా టూత్‌బ్ర‌ష్‌తో రుద్ది శుభ్రం చేస్తే చాక్లెట్ మ‌ర‌క‌లు పోతాయి.
 • బట్టలమీద జ్యూస్ మ‌ర‌క‌లు పడినపుడు వాటిపై అమ్మోనియం రాసి టూత్‌బ్ర‌ష్‌తో రుద్ది శుభ్రం చేస్తే జ్యూస్ మ‌ర‌క‌లు పోతాయి.
 • బట్టలమీద ఐస్‌క్రీం మ‌ర‌క‌లు పడితే కొద్దిగా నిమ్మ‌ర‌సం తీసుకుని నేరుగా ఆ మ‌ర‌క‌ల మీద రాసి ఉతికితే సరిపోతుంది.
 • బట్టలకు గోరింటాకు అంటినప్పుడు అరగంటసేపు పాలలో నానబెట్టి ఉతికితే శుభ్రంగా పోతుంది. పాలు లేకపోతే నిమ్మచెక్కతో రుద్దినా గోరింటాకు మరకలు పోతాయి.
 • జేబు రుమాళ్ళపైన, టవల్స్‌ మీద లిప్‌స్టిక్‌ మరకలు పడినప్పుడు వాటిపై గ్లిసరిన్‌ రాసి కాసేపాగి సబ్బుతో ఉతికితే మంచి ఫలితం ఉంటుంది.
 • చీరల జరీ మీద పడిన మరకలు పోవాలంటే శీకాయపొడితో రుద్ది ఉతికితే మరకలు పోతాయి.  
 • బట్టల మీద కాఫీ, టీ మరకలు పోవాలంటే ఒక టమోటా ముక్కతో మరక మీద రుద్ది సబ్బుతో ఉతికితే మరకపోతుంది.
 • వాంతి చేసుకొన్నప్పుడు బట్టల మీద పడితే వాటిపై నిమ్మ‌ర‌సం రాసి డిట‌ర్జెంట్‌ వాడి ఉతికితే సరిపోతుంది.
 • బట్టల మీద ర‌క్తం మ‌ర‌క‌లు పడితే ఆ బట్టలను ఉప్పు నీటిలో నాన‌బెట్టి పావుగంట తర్వాత ఉతికితే స‌రిపోతుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE