కొందరి చర్మం ఎంతో ఆరోగ్యంగా, మెరిసిపోతూ కనిపిస్తుంది. ఇందుకు వారు తీసుకొనే ఆహారం.. మరీ ముఖ్యంగా పండ్ల రసాల వినియోగమే ప్రధాన కారణం. రోజూ ఏదో ఒక పండ్ల రసం తాగటం వల్ల శరీరానికి అవసరమైన అన్ని పోషకాలూ లభించటమే గాక శరీరంలో పేరుకున్న వ్యర్థాలు సైతం ఎప్పటికప్పుడు బయటికి పోతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే కొన్ని పండ్ల రసాల వివరాలు.. 

  • ఏడాదిపొడవునా లభించే బీట్‌రూట్‌ చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా వారానికి కనీసం 3 సార్లు గ్లాసు చొప్పున దీని రసం తాగితే రక్తశుద్ధి జరిగి చర్మం మెరుస్తుంది.
  • ఒంటినిండా నీరు నింపుకున్న పుచ్చ శరీరంలో తగినంత నీరుండేలా చూసి చర్మాన్ని తాజాగా, మెరిసేలా చేస్తుంది.
  • టమోటా జ్యూస్‌లో కొద్దిగా ఉప్పు లేదా చక్కెర వేసుకు తాగితే చర్మానికి నిగారింపుతో బాటు రక్తశుద్ధి జరుగుతుంది. విటమిన్స్‌ కూడా లభి స్తాయి. అయితే.. ఉదయంపూట ఏమీ తినకుండా టమోటా జ్యూస్‌ తాగకూడదు. ఈ రసాన్ని నేరుగా ఒంటికి రాసుకొని ఆరిన తర్వాత చన్నీటితో కడుక్కొంటే చర్మం తాజాగా మారుతుంది.
  • ఎండ, కాలుష్యం కారణంగా కమిలి, దెబ్బతిన్న చర్మానికి క్యారెట్ రసం మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇది కేవలం చర్మపు ఛాయనే గాక ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తుంది. చర్మపు మృతకణాలను తొలగించి వారి స్థానంలో కొత్త కణాలు పుట్టేలా చేస్తుంది. క్యారెట్ రసంలో లభించే విటమిన్‌ ఏ, సి రోగనిరోధక శక్తిని పెంచి చర్మానికి తగు రక్షణనిస్తాయి.
  • చర్మానికి నిగారింపు తేవటంలో జామపండు రసం చక్కగా ఉపయోగపడుతుంది. జామ ఆకుల రసం కూడా చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని ఎంతగానో కాపాడుతుంది. జామ ఆకుల రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి కుట్టు కుదుళ్లకు పట్టించి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నా నం చేస్తే చుండ్రు వదిలి జుట్టు మెరుస్తుంది.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE