ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా వంటింట్లో అడపాదడపా బొద్దింకలు కనిపిస్తూనే ఉంటాయి. బొద్దింకలు తిరిగిన ఆహారం తినటం వల్ల ఆస్తమా, అలెర్జీ వంటి సమస్యలూ ఎదురవటం తెలిసిందే. బొద్దింక‌ల‌ను త‌రిమికొట్టేందుకు మార్కెట్‌లో పలు స్ప్రేలు అందుబాటులో ఉన్నా అవ‌న్నీ విష పూరిత‌మైన‌వి. కనుక బొద్దింకలను అరికట్టాలంటే వంటింటి వాతావరణంలో మార్పులు తేవటమే ఏకైక ఉత్తమ పరిష్కారం. దీనికోసం ఉపయోగపడే కొన్ని జాగ్రత్తలు, చిట్కాలు.. 

  • ఎండు నిమ్మడిప్పలు లేదా బిర్యానీ ఆకుల పొడి వంటగది మూలలు, అలమరల్లో వేస్తే బొద్దింకలు రావు.
  • చెంచా చొప్పున మిరియాల పొడి, ఉల్లిపాయల పేస్ట్, 3 వెల్లుల్లి రెబ్బలు దంచి ఆ మిశ్రమాన్ని వంటగది మూలల్లో చల్లితే ఆ వాసనకు బొద్దింకలు మాయమవుతాయి.
  • వంటగదిలోని సింకు ఎంత పరిశుభ్రంగా ఉంటే బొద్దింకలు బెడద అంత తగ్గుతుంది. వంటకు వాడిన పాత్రలను కడగకుండా సింకులో పారేయటం అంటే బొద్దింకల్ని ఆహ్వానించటమే. అలాగే సింకు పైపుల్లో ఆహార వ్యర్ధాలు పేరుకోకుండా చూడటం, గొట్టాల నుంచి నీటి లీకేజీ అరికట్టడం ఎంతైనా అవసరం.
  • సింకులోని వంటపాత్రలు కడిగిన తర్వాత చివరిగా సింకులో గుప్పెడు బేకింగ్ సోడా చల్లి పీచుతో రుద్ది వేడివేడి నీరు పోసి కడిగితే సింకు దుర్వాసన రాకపోవటమే గాక దాని గొట్టంలోని ఆహార వ్యర్ధాలు సైతం వదిలిపోతాయి. దీంతో బొద్దింకల బెడదా తగ్గుతుంది.
  • వంటగది మూలల్లో, తలుపు, కిటికీల సందుల్లో ఆహారపదార్థాలు చేరకుండా ఎప్పటికప్పుడు ఊడ్చుకోవటం వల్ల బొద్దింకలు రావు.
  • బీరువాలు, పెట్టెలు, వెలుతురు తక్కువగా అండ్ చోట పెట్టిన బుట్టలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా బట్టలు పెట్టె, బీరువాలో నాఫ్తలీన్ గోళీలు వేస్తే బొద్దింకలు చేరవు.
  • గోడల అల్మారాలు, చెక్క పెట్టెల్లో ఏళ్లతరబడి ఉంచిన పుస్తకాలు, పేపర్లు ఉంచినప్పుడు బొద్దింకలు చేరతాయి. ఈ అపరిస్థితిని నివారించాలంటే తరచూ ఆ చెక్క అలమారాలను ఆలివ్ నూనెతో తుడవటం, పుస్తకాల అల్మారాలో బేకింగ్ సోడా చల్లటం అవసరం.
  • ఒక కోడిగుడ్డు ప‌గ‌లగొట్టి ఆ సొనలో 50 గ్రాముల బోరిక్ యాసిడ్ పౌడ‌ర్ కలిపి ముద్దగా పిసికి దానితో కుంకుడుగాయ సైజు గోళీలు చేసుకొని గంటసేపు నీడలో ఆరనిచ్చి వంటగది మూలల్లో వేస్తే ఆ వాసనకు బొద్దింకలు రానేరావు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE