కొన్ని రోజులుగా  పగలంతా ఎండ, సాయంత్రానికి జడివానలు. ఊహించని రీతిగా కమ్ముకొచ్చే క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో కురుస్తున్న ఈ వానలే గాకుండా అక్కడక్కడా పిడుగులూ పడుతున్నాయి. సూర్య మండల ఉపరితల ఉషోగ్రత (6 వేల డిగ్రీల సెల్సియస్) కంటే పిడుగు కొన్ని లక్షల రెట్లు డిగ్రీల ఉష్ణోగ్రతతో పడే పిడుగు ధాటికి చెట్లూ చేమలే నిలువునా బూడిదై పోతాయి. మనిషి సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఏటా సెకనుకు 100 పిడుగులు చొప్పున నేలను తాకుతున్నాయనీ, వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పిడుగుల ముప్పు తప్పించుకోవచ్చని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు . అవి..

ముఖ్యాంశాలు

 • వర్షం సమయంలో తాటి వంటి ఎత్తైన, జువ్వి, మర్రి వంటి పెద్ద పెద్ద చెట్ల క్రింద నిలబడకూడదు. ఎందుకంటే ఎత్తైన చెట్లు త్వరగా పిడుగు ను ఆకర్షిస్తాయి. ఒకవేళ ఉన్నా కాండానికి దూరంగా ఉండాలి.
 • పిడుగు పడే ముందు ఉరుములు రావటం తెలిసిందే. కనుక ఉరుములు వచ్చే వేళ మైదానాలు, పొలాల్లో గొడుగు వేసుకొని తిరగరాదు. దీనివల్ల గొడుగు చువ్వ గుండా పిడుగు భూమిలోకి వెళ్ళే ప్రయత్నం చేసే ముప్పు ఎక్కువ.  
 • ఉరుములు, పిడుగులతో కూడిన వానలో బయటకు వెళ్ళకపోవడమే మంచిది.
 • మెరుపులు తో పిడుగులు పడుతున్నప్పుడు, అందుబాటులో ఏ బిల్డింగ్ లేనప్పుడు చెట్లు లేని చోట చూసి చేతులు మోకాళ్ళ మీద పెట్టు కొని , తల క్రిందకు వంచి అరికాళ్ళ మీద కూర్చోవాలి.
 • ఉరుములతో వర్షం మొదలైన తర్వాత కాలి నడకన , మోటార్ సైకిల్, సైకిల్ ప్రయాణం మంచిది కాదు .
 • కారు,బస్సు వంటి వాహనాల మీద పిడుగు పడే ప్రమాదం తక్కువ. కనుక అనుకోకుండా పెద్ద వర్షంలో చిక్కుకొంటే సమీపంలో ఏ భవనం లేకపోతే కారు, బస్సు లాంటి వాహనాలు లో కూర్చొంటే మంచిది.
 • పిడుగుల వర్షం సమయంలో కిటికీలు మూసేయాలి. ఎందుకంటే పిడుగు కిటికీల నుండి కూడా లోపలకు రావచ్చు.
 • ఎలక్టికల్ స్తంభాలకు, పెద్దపెద్ద టెలిఫోన్ టవర్లకు,ఇనుప కంచెలు, ట్రాన్ఫార్మర్ లకు దూరంగా ఉండాలి.
 • ఇంట్లో ఉన్నప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్ వాడొద్దు. దీనివల్ల చుట్టుపక్కన ఎక్కడైనా పిడుగు పడినా ఆ ప్రభావం ఫోన్ పట్టుకొన్న వ్యక్తి మీద పడే ముప్పు ఎక్కువ. సెల్ ఫోన్ కానీ కార్డ్ లెస్ ఫోన్ అయితే వాడొచ్చు.
 • పిడుగులు పడేలా ఉన్నప్పుడు చెరువులు, కుంటల్లో దిగకూడదు. పిడుగు నీటిలో పడితే ఆ విద్యుత్తు షాక్ భూమ్మీద పడిన దానికంటే ఎక్కువగా ఉంటుంది.
 • చెప్పులు వేసుకోవడం వల్ల ఆ చుట్టుపక్కల ఎక్కడైనా పిడుగు పడినా షాక్ ముప్పు ఉండదు.
 • పిడుగు భూమివైపు వస్తూనే దానికి దగ్గరగా ఉన్న వస్తువు, పదార్ధం (ఎత్తైన భవనాలు, చెట్లు) గుండా భూమిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. అందుకే ఎత్తైన భవనాలపై ఇనుపకడ్డీలు పెట్టి కాపర్ తీగను భూమిలోకి అమర్చుతారు. దాన్నే లైట్నింగ్ గార్డు అంటారు . అందుకే పెద్ద పెద్ద భవనాల్లో ఉండేవారు తప్పక లైట్నింగ్ గార్డును అమర్చుకోవాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE