భారతీయ మహిళలు బంగారం పట్ల ఎంతో మక్కువ చూపుతారు. వివాహాలు, వేడుకలు, పండుగల సందర్భాల్లో తమ శక్తి మేరకు ఏదైనా నగను సమకూర్చుకునేందుకు ఇష్టపడతారు. దాచుకున్న కొద్దిగొప్పా డబ్బునూ బంగారంగా మార్చుకునేందుకు ఇష్టపడతారు. బంగారం అవసరమైనప్పుడు ఆదుకొనే విలువైన ఆస్తిగానూ భావిస్తారు. అయితే బంగారం కొనే మహిళలు పలు విధాలుగా మోసపోతున్నారు. బంగారం స్వచ్ఛత, ధర, తరుగు, నాణ్యత వంటి అంశాల్లో తగిన అవగాహన లేకపోవటమే ఈ మోసాలకు ప్రధాన కారణాలు. ఈ క్రమంలో బంగారం కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి తెలుసుకుందాం. 

  • షాపులో మీరు కొంటున్న నగ మీద దేశీయంగా బంగారం నాణ్య‌త‌ను నిర్ధారించే బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్(బీఐఎస్) చిహ్నం ఉందా లేదా పరిశీలించాలి. దీనివల్ల ఆ నగ అస‌లుదా, న‌కిలీదా అని గుర్తించ‌వ‌చ్చు.
  • నగ తయారీలో వాడిన బంగారం యొక్క స్వచ్చత గురించి తెలుసుకోవాలి. నూరుశాతం బంగారం సున్నితంగా ఉంటుంది గనుక అది నగల తయారీకి పనికిరాదు. అందుకే అందులో రాగి కలిపి నగలు రూపొందిస్తారు. మార్కెట్లో సహజంగా 23 లేదా 22 క్యారెట్లు అంటే 958 లేదా 916 సింబ‌ల్ ఉన్న బంగారు నగలు అందుబాటులో ఉంటాయి.
  • బీఐఎస్ స‌ర్టిఫికెట్ మాదిరిగా బంగారం నాణ్య‌త‌ను తెలిపే మరో ప్రమాణమైన హాల్‌మార్క్ గుర్తును పరిశీలించాలి.
  • బంగారు నగల మీద వాటి తయారీ సంవత్సరం వివరాలు కోడ్ పద్దతిలో ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఆ నగ మీద A అని ఉంటే అది 2000లో తయారైనట్టు. అలాగే J 2008 ని, N 2011ని, P 2012ని సూచిస్తాయి. ఈ కోడ్ ను బీఐఎస్ నిర్ణ‌యిస్తుంది.
  • చివ‌రిగా నగ తయారీదారు వ్యాపార చిహ్నం దానిపై ఉందా లేదా గమనించాలి.
  • బంగారం ధర, స్వచ్ఛత వంటి అంశాలతో కూడిన సమగ్రమైన బిల్లును తప్పక తీసుకోవాలి. దీనివల్ల ఏదైనా సమస్య వస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు.
  • ఒక్కో తయారీదారు ఒక్కోలా తరుగు నిర్ణయిస్తారు. అలాగే నగను బట్టి తరుగు మారుతుందనే అవగాహన ఉండాలి.
  • పాత నగను మార్చేటప్పుడు పాత నగను ఒక యంత్రంపై, వారిచ్చే కొత్త నగను మరో యంత్రం పై తూకం వేయటం తప్పుడు పద్దతని గమనించాలి.
  • రాళ్ల నగల తరుగు, మేకింగ్‌ ఛార్జీలు ఎక్కువ గనుక మొత్తం బరువుకు 10 శాతం అదనంగా జోడిస్తారని గుర్తుంచుకోవాలి.
  • వజ్రాల నగలు కొనేటప్పుడు బంగారం, వజ్రాల తూకాలు వేరువేరుగా వేసి వాటికి విలువ కట్టారా లేదా గమనించాలి. వజ్రాల రకం, మన్నికలకు సంబంధించిన ఐ.జి.ఐ సర్టిఫికెట్‌ అడిగి తీసుకోవాలి. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE