పట్టణ, నగర ప్రాంతాల్లో ఈ రోజుల్లో ఫ్రిజ్ లేని ఇల్లు లేదు. అయితే ఫ్రిజ్ పనితీరు, దాని నిర్వహణ విషయంలో తగినంత అవగాహన లేనికారణంగా ఒక్కోసారి చిన్న సమస్యలు ఎదురవుతుంటాయి. ఒక్కోసారి తరచూ వచ్చే మరమ్మతుల కారణంగా చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సిరావచ్చు. అందుకే ఫ్రిజ్ నిర్వహణ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించటం అవసరం.

 • కొత్తగా ఫ్రిజ్ కొన్నపుడు అరగంటపాటు ఫ్రిజ్ తలుపు తెరిచి ఉంచాలి.
 • మీరు వాడేది పాత మోడల్ ఫ్రిజ్‌‌ అయితే దానికి స్టెబిలైజర్ తప్పనిసరి. విద్యుత్ సరఫరాలో వచ్చే వోల్టేజీ తేడాలను ఇది సరిచేస్తుంది. ప్రస్తుతం వచ్చే ఫ్రిజ్ లకు స్టెబిలైజర్ లోపలే అమర్చి ఉంటుంది గనుక విడిగా స్టెబిలైజర్ అవసరం లేదు.
 • ఫ్రిజ్ పనితీరు కంప్రెసర్ మీదే ఆధారపడి ఉంటుంది గనుక కంప్రెసర్‌లో సమస్యలున్నాయా అనేది పరిశీలించుకోవటం మంచిది.
 • ఫ్రిజ్ వెనక ఉండే వేడిని తగ్గించే కాయిల్స్ మీద చెత్తాచెదారం, బూజు పడకుండా చూసుకోవాలి. లేకుంటే కాయిల్స్ సరిగ్గా పని చేయక  కంప్రెసర్ మీద భారం పడి ఫ్రిజ్ పనితీరు మందగిస్తుంది.
 • కనీసం నెలకోసారైనా ఫ్రిజ్‌ లోని పదార్థాలన్నీ బయటపెట్టి లోపలి ట్రేలు కడిగి ఆరనివ్వాలి. బయటివైపు శుభ్రం చేసేందుకు కోలిన్ లిక్విడ్ వాడాలి. లేకపోతే క్రిమికీటకాలు చేరే అవకాశముంది.
 • 2 గంటలకు మించి విద్యుత్ కోత ఉన్నప్పుడు ఫ్రిజ్ తెరిచి పెట్టాలి. లేకుంటే లోపలి పదార్ధాలు పాడయ్యే అవకాశముంది.
 • పిల్లలు తరచుగా ఫ్రిజ్ తెరచి చూస్తుంటారు. అయితే తిరిగి తలుపు సరిగా వేయటం మరచిపోతారు. దీనివల్ల లోపలి చల్లదనమంతా బయటికి వెళ్లిపోయి కంప్రెసర్ మీద భారం పడి విద్యుత్ బిల్లు పెరుగుతుందని గుర్తించాలి.
 • హీటర్లు, స్టవ్‌ ఉన్నచోట, అధికవేడి ఉండేచోట, ఎండ పడే చోట ఫ్రిజ్ పెట్టకూడదు. అలాగే ఫ్రిజ్‌ ఉన్నచోట స్వచ్చమైన గాలి తగలాలి. ఫ్రిజ్ పనిచేస్తున్నప్పుడు దాన్ని అటూ ఇటూ కదపకూడదు.
 • విద్యుత్ ఆదా కోసమని రాత్రి ఫ్రిజ్‌ను స్విచ్చాఫ్ చేయకూడదు. విద్యుత్ బిల్లు మరీ ఈకువగా వస్తుంటే మాత్రం రాత్రి పడుకోబోయేముందు దాన్ని డీఫ్రాస్ట్ చేయొచ్చు.
 • ఫ్రిజ్‌లు రాత్రి భారీ శబ్ధాలు గమనిస్తే డీలర్‌ను సంప్రదించి మరమ్మతు చేసివ్వాల్సిందిగా కోరండి.
 • నెలలతరబడి ఊరెళితే తప్ప ఇంట్లో ఫ్రిజ్ స్విచ్చాఫ్ చేయకూడదు. స్విచ్చాఫ్ చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా ఖాళీ చేయాల్సిందే. ఊరినుంచి వచ్చాక తిరిగి అరగంట తెరిచి ఉంచి వాసన పోయాక వాడుకోవచ్చు. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE