సాధారణంగా పసిపిల్లలు ఏ సమస్య వచ్చినా ఏడుస్తుంటారు. నిజానికి ఆ వయసులో వారి సమస్యను పెద్దల దృష్టికి తెచ్చేందుకు గల ఏకైక, మేలైన మార్గం అదే. ఆకలి మొదలు అనారోగ్యం వరకు పిల్లలు ఏడవటం సహజమే. అయితే పిల్లల పెంపకం మీద అవగాహన లేని తల్లిదండ్రులు పిల్లలు పట్టుమని 10 నిమిషాలు ఏడవగానే.. ఆసుపత్రికి పరుగులు పెడుతుంటారు. మరి కొందరు హైరానా పడుతూ ఏం చేయాలో తోచకా వారూ ఏడుస్తూ ఉంటారు. ఈ సమస్యలన్నింటికీ ఏకైక పరిష్కారం పిల్లల పెంపకం మీద అవగాహన పెంచుకోవటమే . పిల్లల ఏడుపు విషయంలో పెద్దలు తెలుసుకోవలసిన, పాటించవలసిన  కొన్ని ముఖ్యాంశాలు..

  • కొందరు పిల్లలు ఎప్పుడో ఓసారి, మరికొందరు ప్రతిదానికీ ఏడుస్తుంటారు. అలాగే ఆ ఏడుపు తీవ్రత, ఏడ్చే తీరులోనూ తేడాలుంటాయి. పెద్దలు ఈ అంశాలను జాగ్రత్తగా గమనించాలి.
  • సాధారణంగా పిల్లలు దప్పికగా ఉన్నా, ఆకలి వేసినా ఏడుస్తారు. అందుకే నిర్ణీత సమయం అయ్యేసరికి వారికి అందించాల్సిన పాలు, ఆహారం అందించే ఏర్పాటు చేయాలి. ఆరు నెలలు దాటిన, పాపాయి ఆరోగ్యంగా, బలంగా ఉన్న పిల్లలు పాలు పట్టించినా ఏడుస్తున్నారంటే వారికి పాలతో బాటు తేలికపాటి ఘనాహారం తినే వయసు వచ్చినట్లు గుర్తించాలి.
  • వాతావరణాన్ని బట్టి పాపాయికి పట్టే పాలు, పండ్ల రసాలు, నీళ్లు మార్చుతూ ఉండాలి. ముఖ్యంగా చలికాలంలో ఆహారం గోరువెచ్చగా ఉండేలా చూసుకోవటం, గది వెచ్చగా ఉండేలా చూడటం, ఉన్ని దుస్తులు వాడటం ఎంతైనా అవసరం.
  • డైపర్ లో మలమూత్ర విసర్జన చేసి, దానిని వెంటనే పట్టించుకోక పోతే కూడా పిల్లలు చిరాకుతో ఏడుస్తారు.
  • నిద్ర వేళకి ఆహ్లాదకరమైన వాతావరణం లేకున్నా, పెద్దపెద్ద శబ్దాలు విన్నా, విద్యుత్ లేకపోయినా, తాము ఏకాతంగా ఉన్నట్టు అనిపించినా అసౌకర్యంగా ఉండి ఏడుస్తారు.
  • అనారోగ్యం , అసౌకర్యం మూలంగా కనిపించే పిల్లల ఏడుపులో తేడా ఉంటుంది. దీన్ని పెద్దలు తెలుసుకోవటం ద్వారా ఆసమయానికి తగినట్లు వ్యవహరించొచ్చు.
  • చీమ కరిచినా , దోమలు కుట్టినా పిల్లలు ఏడుస్తుంటారు. ఇలాంటప్పుడు పాపాయిని పడుకోబెట్టి పాదాలను నిమురుతూ, కుట్టిన భాగంలో 10 నిమిషాలు మర్దన చేయాలి.
  • జలుబు చేసిన పిల్లలు ఊపిరి తీసుకోలేక ఏడుస్తారు. ఇలాంటప్పుడు పలుచని గుడ్డ ఒత్తిలాగ చేసి ముక్కు రంధ్రాలు శుభ్రం చేసి , ముఖానికి కాస్త ఆవిరిని జాత్త్రగా పట్టటం, ఛాతిపై తట్టడం చేయాలి. అప్పటికీ ఏడుపు మానకపోతే గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి.
  • పిల్లలకు నిద్ర చాలకపోయినా, నిద్రకు భంగం కలిగినా ఏడుపు లంకించుకొంటారు. శిశువులు 3 నెలలు నిండేవరకు రోజులో కనీసం 18-20 గంటలు విడతలవారిగా నిద్ర పోతారు. మధ్యలో లేచి పాలు తాగటం, పడుకోవటం చేస్తారు. 3-12 నెలల పిల్లలు రోజులో 14-15 గంటలు, 2-4 ఏళ్ల వయసు పిల్లలు రోజులో 12 గంటలు నిద్రపోతారు. 5-9 ఏళ్లు వచ్చేనాటికి 10 గంటల నిద్రకు అలవాటుపడ్తారు.
  • కొందరు పిల్లలు 3 నెలల వయసు వచ్చేవరకు తరచూ ఏడుస్తూనే ఉంటారు. ఇలాంటప్పుడు పిల్లలను గమనిస్తూ, వారి ఏడుపుకు తగినట్లు స్పందించాలి. ఇలా చేస్తే ఆ తర్వాత వారే ఏడుపు మానుకొంటారు.

 

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE