• కరివేపాకుని ఎండపెట్టి పొడి చేసి, గాలి చొరబడని సీసాలో భద్రపరచుకొని, కూరలు, వేపుళ్ళలో వాడుకుంటే కమ్మని వాసనతో బాటు చెప్పుకోదగినన్ని పోషకాలూ అందుతాయి.
 • ఫ్లాస్క్ ఎంత కడిగినా టీ, కాఫీ వాసనలు పోకపోతే మజ్జిగతో కడిగితే సరి.
 • బొంబాయిరవ్వతో ఉప్మా చేసేటప్పుడు ఉండలు కట్టకుండా ఉండాలంటే రవ్వకి చెంచా నూనె పట్టిస్తే సరిపోతుంది.
 • వంటకాల్లో కారంతో పాటు చిటికెడు ఉసిరిక పొడిని వేస్తే పదార్థాలు మరింత రుచిగా ఉంటాయి.
 • ఆమ్లెట్‌కు అదనపు రుచి రావాలంటే సొనకు కొబ్బరి కోరు జోడించాలి.
 • సూప్‌ను పొయ్యి మీద నించి దించాక రెండు చెంచాల పాల మీగడ కలిపితే చిక్కదనంతో పాటు రుచి గా కూడా వుంటుంది.
 • తరిగిన బంగాళ దుంపలు రంగు మారకుండా ఉండాలంటే ఆ ముక్కలపై వెనిగర్ చల్లితే చాలు.
 • తేనె సీసాలో నాలుగైదు మిరియాలు వేస్తే చీమలు చేరవు.
 • అల్లం వెల్లుల్లిని రుబ్బే ముందు కొద్దిగా వేయించితే ఆ మిశ్రమం ఎక్కువ రోజులు తాజా గా ఉంటుంది.
 • బెండకాయ కూర చేయడానికి ముందు ముక్కల మీద కాస్త నిమ్మ రసం చల్లితే జిగురు ఉండదు.
 • సాంబార్లో ఉప్పు ఎక్కువైతే ఉడికించిన బంగాళ దుంపలు వేస్తే సరి.
 • అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే వాటిని తరిగాక మజ్జిగలో వేస్తే సరి.
 • వంకాయ కూరలో రెండు చుక్కలు నిమ్మరసం పిండితే కూర రంగు మారదు, రుచిగా వస్తుంది.
 • పాలు కాగేటప్పుడు పాలపై చిల్లుల మూత లేదా గిన్నెను పెడితే మీగడ బాగా కడుతుంది.
 • కారం డబ్బాలో ఓ చిన్న గుడ్డలో ఇంగువ కట్టి ఉంచినట్లయితే కారం ఘాటు పోకుండా ఉంటుంది.
 • చపాతీలు మరింత రుచిగా కావాలనుకుంటే గోధుమపిండిలో కొద్దిగా బార్లీ, శనగపిండి కలిపితే మంచి రుచిగా ఉంటాయి. మృదువుగా వుంటాయి.
 • బిస్కట్లు భద్రం చేసే డబ్బాలో అడుగున బ్లాటింగ్‌ పేపర్‌ వేసి దాని మీద బిస్కెట్లు పెడితే ఎక్కువ కాలం నిల్వ ఉండడంతో పాటు కరకరలాడుతూ ఉంటాయి.
 • స్విమ్మింగ్‌ పూల్‌లో దిగేముందు సన్‌ స్క్రీన్‌ లోషన్‌ కానీ క్రీమ్‌ కానీ చర్మానికి రాసుకుంటే ఎటువంటి సమస్యలూ రావు.
 • ఎండాకాలంలో వచ్చే చెమటకాయలు, మచ్చల నుండి ఉపశమనం కావాలంటే బాగా మగ్గిన అరటిపండును మెత్తగా చేసి వాటిపై‚ రాస్తే చల్లగా వుంటుంది. తొందరగా తగ్గుతాయి.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE