జీలకర్ర ఆరోగ్యానికి ఎంత మంచిదే తెలిసిందే. వంటకాలకు రుచిని, సువాసనని అందించే ఈ జీలకర్ర వేసి కాచిన గోరువెచ్చని నీటిని పరగడుపునే తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. వారానికోసారైనా ఇలా తాగితే కలిగే ప్రయోజనాలివే. 

  • జీల‌క‌ర్ర నీటిని తాగితే జీర్ణాశ‌యం శుభ్ర‌పడి మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్‌, అసిడిటీ, అజీర్తి, క‌డుపులో వికారం, క‌డుపులోని అల్సర్లు వదిలిపోతాయి. క‌డుపులో పురుగులు ఉంటే చ‌నిపోతాయి.
  • జీల‌క‌ర్ర నీరు తాగితే మూత్రం ధారాళంగా వ‌స్తుంది. కిడ్నీరాళ్లు క‌రుగుతాయి. కిడ్నీల్లో చేరిన వ్యర్థాలు వదిలి పోతాయి.
  • జీల‌క‌ర్ర నీటిని తాగితే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి.
  • జీలకర్ర మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. సుఖనిద్ర కోరుకొనే వారికి ఈ నీరు మంచి ఔషధం.
  • బాలింతలు జీల‌క‌ర్ర నీరు తాగితే క్షీర గ్రంథులు ఉత్తేజితమై తగినన్ని చనుబాలు పడతాయి.
  • మధుమేహులు జీలకర్ర నీరు తాగితే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
  • జీల‌క‌ర్ర నీరు తాగేవారికి రక్తపోటు అదుపులో ఉంటుంది. దీంతో రక్తస‌ర‌ఫ‌రా మెరుగు ప‌డటమే గాక రక్త నాళాల్లోని అడ్డంకులు తొల‌గి గుండె స‌మ‌స్య‌లు రావు.
  • జీలకర్రలోని స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ వైర‌ల్‌, యాంటీ బ‌యోటిక్‌, యాంటీ బాక్టీరియ‌ల్, యాంటీ ఫంగ‌ల్ గుణాలురోగ నిరోధ‌క శ‌క్తిని పెంచి ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చేస్తాయి. దీనివల్ల ద‌గ్గు, జ‌లుబు వంటి అనారోగ్యాలు దరిజేరవు.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE