ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎండల ధాటికి చర్మం ఎంతోకొంత దెబ్బతినటం ఈ సీజన్లో  సహజమే. ఇలా దెబ్బతిన్న చర్మానికి ఉపశమనాన్ని కల్గించి, సహజసిద్ధమైన నిగారింపును అందించేందుకు కృత్రిమమైన క్రీమ్ ల కంటే గృహ వైద్యాన్ని ఆశ్రయించటం మంచిది.  ఈ వేసవిలో వంటింటి దినుసులు, కూరగాయలతో సులభంగా  చర్మ సంరక్షణ చేపట్టాలనుకునే వారికోసం కొన్ని చిట్కాలను అందిస్తున్నాం. మీరూ తప్పక ప్రయత్నించి చూడండి.

  • బకెట్ నీళ్ళలో రెండు నిమ్మకాయలు పిండి ఆ నీటితో స్నానం చేయాలి. వేసవి వెళ్ళేవరకూ ఇలా చేయటం వల్ల చర్మం తాజాగా ఉండటంతో బాటు చెమట, జిడ్డు కారణంగా వచ్చే దుర్వాసన కూడా దూరమవుతుంది .
  • వెంట్రుకలకు తగలకుండా ఒంటికి తేనే రాసుకుని తేలికగా మర్దనా చేసుకుని పూర్తిగా ఆరక ముందే స్నానం చేస్తే చర్మం పట్టుకుచ్చులా మారుతుంది.
  • తులసి, నిమ్మ రాసాని సమపాళ్ళలో కలిపి రెండు పూటలా ముఖం, మెడ భాగాలకు పట్టించి ఆరాక చల్లని నీటితో కడిగితే కాలుష్యం కారణంగా చేరే మురికి వదిలి పోతుంది.
  • రాత్రి పడుకోబోయే ముందు బాదం పాలలో ముంచిన దూదితో ముఖం,మెడ భాగాలను అద్ది, తెల్లారి లేవగానే చల్లని ముఖాన్ని నీటితో కడుక్కుంటే తాజాగా ఉంటుంది. లేదా రోజూ రాత్రి నానబెట్టిన బాదం గింజలను రుబ్బి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాలకు పట్టించి ఉదయాన్నే కడిగినా చాలు.
  • వారానికి కనీసం రెండు సార్లు బంగాళదుంప రసాన్ని ముఖానికి రాసి అరగంట తర్వాత కడుగుతుంటే కమిలిన చర్మం పూర్వ స్థితికి వస్తుంది.
  • పసుపు కలిపిన పచ్చిపాలలో దూది పింజల్ని నాననిచ్చి ఫ్రిజ్ లో ఉంచి రోజుకో పింజ తీసి ముఖం, మెడ భాగాలను శుభ్రం చేసుకుంటే ఎలాంటి ఇన్ఫెక్షన్ లో దరిచేరవు.
  • పసుపు, శనగపిండి, నెయ్యి మిశ్రమాన్ని ముఖానికి  రాసి ఆరాక చేత్తో మృదువుగా గుండ్రంగా మసాజ్‌ చేస్తే పొడిబారిన చర్మం మీది మురికి తొలగిపోయి ఛాయా కూడా మెరుగు పడుతుంది. 
  • మీగడలో పసుపు కలిపి రోజూ చర్మానికి రాసి నెమ్మదిగా మసాజ్‌ చేస్తే చర్మం మెరిసి పోతుంది.
  • పసుపు, సాన్ మీద అరగదీసిన గంధం, రోజ్‌వాటర్‌ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే ఎండకు నల్లబడ్డ చర్మం కాంతివంతంగా మారుతుంది.Recent Storiesbpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

మోక్షదాయని.. ముక్కోటి ఏకాదశి

తిథులలో ఏకాదశి ఎంతోవిశిష్టమైనది. శివకేశవులిద్దరికీ ఇష్టమైన ఈ తిథినాడు పగటి ఉపవాసంతో దైవారాధన, రాత్రి భగవన్నామ

MORE