దంపతుల మధ్య చక్కని అవగాహన, అనుబంధం ఉండటంలో వస్తు కీలక  పాత్ర పోషిస్తుంది. వినటానికి ఇది నమ్మశక్యంగా లేకున్నా ముమ్మాటికీ నిజం. పడకడి విషయంలో వాస్తు సూచిస్తున్న కొన్ని ఆసక్తికరమైన అంశాలను తెలుసుకుందాం.

  • వాస్తు శాస్త్రం ప్రకారం దంపతుల ప్రధాన పడక గది నైరుతి మూలలో ఉండాలి. దీనివల్ల దంపతుల ఆరోగ్యం, వారి మధ్య ప్రేమానుబంధాలు బాగుంటాయి.
  • సౌత్ వెస్ట్ అని పిలిచే నైరుతి మూలాన పడక గది ఉంటే ఆ దంపతులకు స్థిరత్వం, ఇంద్రియజ్ఞానం, మంచి అనుభవాలు, లైంగిక ఆనందం సమకూరుతాయి.
  • వాయువ్య మూలన ఉండే గది పడక గదిగా దంపతులు వాడటాన్ని వాస్తు నిషేధించింది. ఇలా ఉన్న దంపతుల మధ్య లైంగిక ఆసక్తులు తగ్గటం, ధార్మికమైన అంశాల పట్ల అతిగా ఆకర్షితులయ్యే ప్రమాదం ఉంటుంది.
  • పడకగదిలో వాడే రంగులు సైతం దంపతుల మధ్య అనుబంధాన్ని ప్రభావితం చేస్తాయని వాస్తు చెబుతోంది. వంగపండు రంగు, గులాబి, లేత ఎరుపు రంగులు దంపతులకు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ముదురు ఆకుపచ్చ, నలుపు, నీలం రంగులు దంపతుల మధ్య వ్యతిరేక భావనలకు కారణమవుతాయి.
  • పడుకునేటప్పుడు తల దక్షణం వైపు, కాళ్ళు ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలని వాస్తు నిర్దేశిస్తోంది. ఒక వేళ  అది సాధ్య పడక పోతే తూర్పు వైపు తల, కాళ్ళు పడమర దిశలలో పెట్టి  పడుకోవచ్చని వాస్తు చెబుతోంది. అయితే ఇలా పడుకున్నప్పుడు దక్షిణాన్ని చూస్తున్నట్లు ఎడమవైపు తిరిగి పడుకోవటం మంచిదని వాస్తు చెబుతోంది.
  • పడక గదిలో తెరచిన అలమరలు, చెమ్మ అధికంగా ఉండటం, పెద్ద పెద్ద శబ్దాలు వినిపించేలా ఉండటం మంచిది కాదని వాస్తు చెబుతుంది.
  • పడక గది దక్షిణపు గోడ వైపు తలపెట్టి పడుకునే వారు ఆ గోడకు పావురాల జంట చిత్రం , హృదయాకారపు చిత్రాలు, నవ్వుతూ ఉన్న దంపతుల చిత్రాలను అమర్చుకోవాలి. ఈ చిత్రాలకు ఎరుపు రంగు ఫ్రేమ్ ఉంటే మరింత సానుకూల ఫలితాలు వస్తాయి.
  • పడకగదిలో తలవైపు గోడకు కిటికీ ఉండరాదు. ఇలా ఉంటే ప్రతికూల ప్రభావాలు తప్పవు

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE