మనిషి ప్రాథమిక అవసరాల్లో ఇల్లు మొదటిది. అయితే ఆ ఇల్లు నివాసయోగ్యంగా, సానుకూల ఫలితాలు ఇచ్చేదిగా ఉన్నప్పుడే కుటుంబమంతా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండటం సాధ్యమవుతుంది. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని  కొన్ని వేల సంవత్సరాల క్రితమే భారతీయ ఋషులు  శాస్త్రీయమైన ఆలోచనలతో వాస్తు శాస్త్రాన్ని ప్రతిపాదించారు. గృహ నిర్మాణానికి సంబంధించి వాస్తు చెప్పే ఎన్నో విషయాలను నేటి సైన్స్ కూడా అంగీకరిస్తోంది. 

ఇంట్లోకి గాలి, వెలుతురుతో బాటు సానుకూల శక్తి తరంగాలు ప్రసరించటంలో కిటికీ పాత్ర ఎంతో ముఖ్యం. ఇంటికి ఏ దిశలో కిటికీలు ఉండాలి? తదితర అంశాల గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. 

  • నైరుతి గదిలో పశ్చిమ వాయువ్యంలో లేక దక్షిణ ఆగ్నేయంలో ఎక్కడ వీలైతే అక్కడ కిటికీ పెట్టుకోవచ్చు. అవసరం అనుకుంటే రెండు చోట్లా పెట్టుకున్నా అభ్యంతరం లేదు గానీ చిన్న సైజులో ఉండేలా చూసుకోవాలి.
  • ఇంటి నైరుతి గదిలో నైరుతి మూలన ఎత్తి పరిస్థితిలో కిటికీలు పనికిరావు. ఒకవేళ తప్పని పరిస్థితిలో అక్కడ  కిటికీ పెట్టాల్సి వస్తే ఇంటి ఈశాన్య మూల గదిలో ఈశాన్యాన కూడా తప్పక పెద్ద సైజు కిటికీ పెట్టాల్సిందే.
  • ఇంటి దక్షిణ, పశ్చిమ గదుల్లో కూడా కిటికీలు పెట్టుకోవచ్చు గానీ చిన్న సైజులో మాత్రమే ఉండాలి.
  • వాయువ్య గదిలో పశ్చిమ వాయువ్యాన కిటికీ వస్తే చాలా మంచిది.
  • ఇంటి ఉత్తర, తూర్పు, ఈశాన్యపు గదులకు ఎన్ని వీలయితే అన్ని పెద్ద సైజు కిటికీలు పెట్టుకోవచ్చు. ఈ విషయంలో సంఖ్య పట్టింపు లేదు.
  • ఇంటి ఆగ్నేయ గదిలో దక్షిణ ఆగ్నేయాన కిటికీ పెట్టుకోవటం మంచిది.
  • వాస్తు ప్రకారం సాధారణంగా టేకు వంటి ఉత్తమ జాతి కలపతో చేసిన కిటికీలు మంచివి. అయితే ఇప్పటి రోజుల్లో అది ఖరీదైన వ్యవహారం కావటంతో అల్యూమినియం, ఉక్కు, పాలిమర్ ఆధారిత కిటికీలు వాడుతున్నారు. అయితే ఇది దోషమేమీ కాదు.
  • సింహ ద్వారం, కిటికీ కలిసి ఉన్నందున నష్టమేమీ లేదు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE