• ఇంటికి తూర్పు ఆగ్నేయం,ఉత్తర వాయువ్యం,పడమర నైరుతి,దక్షిణ నైరుతి వీధి పోట్లు సమస్యలు సృష్టిస్తాయి.
  • ఇంట్లో డబ్బు, ఇతర విలువైన వస్తువులుంచే బీరువాలును నైరుతి మూలగా పెట్టి ఉత్తర దిశగా తెరుచుకునేలా అమర్చుకోవాలి.
  • తూర్పు మరియు ఉత్తర ప్రహరి గోడలపై పూల చెట్లను పెంచరాదు.
  • ఇల్లు, దుకాణాలకు దృష్టి దోషం తగలకుండా ఉండాలంటే పసుపు దారంతో 3 పసుపు కొమ్ములు గుమ్మానికి వ్రేలాడదీయాలి.
  • ఉన్న చోటుకి ఆనుకుని ఉన్న పడమర స్థలాన్ని కలుపుకుంటే భార్యకు అనారోగ్యం,నష్టం కలిగే ప్రమాదం ఉంది.
  • ఇంటి సీఎంగా ద్వారంపై మరణించిన పెద్దల ఫోటోలు అస్సలు పెట్టకూడదు. ఇంటి దైవం, గణపతి ఫోటోలను పెట్టుకుంటే అన్నివిధాలా మేలు జరుగుతుంది.
  • గృహ నిర్మాణ సమయంలో గోడలకు చేసిన రంధ్రాల వంటి వాటిని పూర్తిగా మూసివేయాలి.
  • ఇల్లు వాయువ్యాన పెరిగినా లేక మూసివేసినా అక్కడ హనుమంతుని ఉంచి పూజించిన ఆ దోషాల తీవ్రత తగ్గును.
  • బావులు, నీటి నిల్వ ఈశాన్య మూలాన చేసుకోవాలి. ఈశాన్యంలో బరువు ఉంచరాదు. పడమర వైపు, దక్షిణం వైపు బరువులు ఉంచవచ్చును.
  • దేవాలయాల నీడ, ధ్వజ స్థంభం నీడ పడే స్థలంలో ఇల్లు నిర్మించరాదు. అలాంటి ఇళ్లలో నివాసం పనికిరాదు.
  • పుట్ట ఉన్న స్థలం కొనరాదు. ఒకవేళ తెలియక కొన్నా గృహ నిర్మాణానికి ముందే తగిన శాంతి జరిపించే ఇంటి నిర్మాణం చేయాలి. లేకుంటే సంతానలేమి, అల్పాయుష్కులైన సంతానం, అవిటి పిల్లలు జన్మించుట వంటి సమస్యలు వస్తాయి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE