డబ్బు అందరూ సంపాదిస్తారేమో గానీ దాన్ని నిలుపుకునే వారు కొందరే. ఈ సమస్యకు సరైన ఆర్ధిక ప్రణాళిక లేకపోవటం, దుబారా వంటి కారణాలతో బాటు వాస్తు దోషాలు కూడా కారణమేనని చెప్పాలి. అయితే ఈ సమస్యకు ఫెంగ్‌షుయ్‌ వాస్తులో చక్కని పరిష్కార మార్గాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాం.

 • డబ్బు నిలవని వారు రాత్రిపూట ఇంట్లో దీపాలన్నీ ఆర్పివేయకుండా కనీసం ఒక్క దీపాన్నైనా వెలుగుతూ ఉండేలా చూడాలి. అదీ కదులుతూ ఉండే నూనె దీపం అయితే మరీ మంచిది. దీనివల్ల అదనపు, ఊహించని ఖర్చులు రావు.
 • ఇంట్లో డ్రాయింగ్ రూం నైరుతి మూలన అక్వేరియం పెట్టుకొని, తగిన రీతిన నిర్వహించగలిగితే అందులోని చేపల మాదిరిగా ఇంట్లోని వారు ఉల్లాసంగా, ఆరోగ్యంగా జీవితాన్ని గడపటమే గాక సంపద వృద్ధి అవుతుంది.
 • మీ అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్ పొడవైన కారిడార్‌ చివరగా ఉంటే అక్కడ ప్రతికూల శక్తి ప్రభావం పోగయ్యే ప్రమాదం ఉంటుంది. కనుక అక్కడ ఏదైనా పూలమొక్క, మనీ ప్లాంట్ ఉన్న కుండీ పెట్టుకొంటే డబ్బు, పెట్టుబడులకు ఎలాంటి నష్టం ఉండదు.
 • ధనలాభం కోరుకొనే వారు ఇంటి ప్రవేశ ద్వారం ఉన్న గోడకు సానుకూల తరంగాలను ఉత్పత్తి చేసే తెలుపు, లేత నీలం,.గులాబీ వంటి రంగులు వేసుకోవాలి తప్ప నలుపు, నిండుఎరుపు వంటి రంగులు వేయకూడదు. పొరుగిళ్ల రంగుల కంటే మీ ఇంటి రంగు భిన్నంగా, చూసేందుకు ఆహ్లాదంగా ఉండేలా చూసుకుంటే మరిన్ని సానుకూల ఫలితం ఉంటుంది.
 • ఇంట్లో పగిలిన గాజు వస్తువులు, కిటికీ అద్దాలు లేకుండా చూడాలి. గాజు వస్తువులను ఎప్పుటికప్పుడు శుభ్రం చేయాలి.
 • ఇంట్లో సూర్య కిరణాలు పడే కిటికీ వద్ద స్పటికాల మాల వేలాడదీస్తే కాంతి శక్తి తరంగాలు ఇల్లంతా ప్రవహించి ఆర్ధిక లబ్ధి చేకూరుతుంది.
 • బీరువాలో డబ్బు ఉంచే లాకర్‌ను ప్రతిబింబించేలా ఒక అద్దాన్ని బీరువా తలుపు లోపలివైపు అమర్చితే ఖర్చులు తగ్గుతాయి.
 • ఆదాయమ కంటే వ్యయం ఎక్కువ ఉంటే స్నానాల గదిలో ఓ మూల ఒక కుండీ ఉంచి అందులో కొన్నిమొక్కలు లేదా విత్తనాలు వేయాలి.
 • ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూడండి.
 • అవకాశం ఉన్నవారు ఇంట్లో ఈశాన్యాన చిన్న ఫౌంటెన్‌ పెట్టుకోండి. లేదా కనీసం నీరు పారే శబ్దం ఇంట్లో వచ్చేలా చూడండి. దీనివల్ల సానుకూల శక్తి ప్రవహించి ఊహించనిరీతిలో సంపద చేరుతుంది.
 • డబ్బు, నగలు, ఆస్తి పత్రాలు ఉంచే అలమర లేదా లాకర్ పడమర గోడకు పెట్టి తూర్పు ముఖంగా తలుపు తెరుచుకునేలా చూడాలి. అలా వీలు కుదరకపోతే దక్షిణపు గోడకు లేదా నైరుతి మూలన ఉంచి కుబేరుని దిక్కు అయిన ఉత్తర ముఖంగా తలుపు తెరుచుకునేలా చూడాలి. అలాగాక ఆగ్నేయ, వాయువ్య దిక్కులలో బీరువా పెడితే మాత్రం అకారణంగా ధన నష్టం, దుబారా ఖర్చులు తప్పవు.
 • డబ్బు, నగలు, ఆస్తి పత్రాలు ఉంచే అలమర లేదా లాకర్ మీద అటక లేదా ఇంటి దూలం ఉండరాదు.
 • ఇంటి ఈశాన్యాన సంప్‌, బోర్‌వెల్‌ లేదా బావి నిర్మిస్తే ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE