• HOME
 • వాస్తు
 • వాస్తు విరుద్ధ పొరబాట్లు.. వేధించే సమస్యలు

కొందరు వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్నాతెలిసీ తెలియక చేసే వాస్తు విరుద్ధమైన పనుల వల్ల సమస్యల బారిన పడుతుంటారు. ఒక్కోసారి ఈ పొరబాట్లు ఊహించని ప్రమాదాలు, ఆర్థిక సమస్యలకు దారి తీస్తాయి. అందుకే ఇంటిపని, వంట పని మొదలు అన్నిపనులు చేసేటప్పుడు వాస్తును పరిగణలోకి తీసుకోవాలి. సమస్యలకు కారణమయ్యే కొన్ని వాస్తు విరుద్ధమైన పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 • నూటికి 90 వాస్తు సమస్యలు ఈశ్వర స్థానమైన ఈశాన్య మూలను నిర్లక్ష్యం చేయటం వల్లే వస్తాయి. ముఖ్యంగా ఈ మూలన వంట చేయటం వల్ల ఎంత డబ్బు వచ్చినా ఆవిరైపోవటం, విలువైన వస్తువులు తాకట్టు పెట్టాల్సిన దుస్థితి దాపురిస్తుంది. దంపతుల స్పర్థలు, కన్నవారు, తోబుట్టువులు, మిత్రులతో ఊహించని వివాదాలతోబాటు అలాంటి ఇంట్లో ఉండే అత్తాకోడళ్ల మధ్య పోరు ఉంటుంది. కనుక ఇంటి ఈశాన్య భాగంలో వంట చేసేవారు తక్షణం ఆగ్నేయ మూలన చేసుకోండి.
 • ఒకవేళ ఆగ్నేయంలో వంటగది లేకున్నాలేదా ఆగ్నేయాన వంట చేయటం కుదరకపోతే వాయవ్య గదిలో, తూర్పు దిశగా వంట చేసుకోవచ్చు గానీ దీనివల్ల బంధువుల తాకిడి పెరిగి ఇల్లాలికి క్షణం తీరిక దొరకదు.
 • ఈశాన్యాన చీపురు పెట్టటం, చెత్త పోగుజేయటం వంటి తప్పులు చేస్తే ఆ ఇంట దరిద్రం తాండవిస్తుంది. అందుకే ఇల్లు చిమ్మేటప్పుడు లేదా తుడిచేటప్పుడు ముందు ఈశాన్య మూలను వస్త్రంతో శుభ్రం చేసి తర్వాతే మిగతా గదులు శుభ్రం చేయాలి.
 • సోఫాలు, దివాన్‌లు, డైనింగ్ టేబుల్, టీవి షోకేస్‌ వంటి బరువులు ఈశాన్య మూలన ఉంచరాదు. ఈ మూలన బావి, నీళ్ల పంపు, కుళాయిలు ఉండటం శ్రేయస్సును కలిగిస్తుంది.
 • ఈశాన్యాన బరువు ఎంత ప్రమాదకరమో నైరుతి గదిలో బరువు తక్కువగా ఉంచటమూ అంతే ప్రమాదం. ముఖ్యంగా ఇంట్లో డబ్బులు లేదా విలువైన వస్తువులను వుంచే బీరువా మొదలు ఇతర బరువైన వస్తువులను నైరుతి గదిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా నైరుతి గదిని యజమాని మాస్టర్ బెడ్‌రూంగా వాడుకోవాలి.
 • ఇంటి నైరుతి మూలన తలుపు పెట్టి అటునుంచి రాకపోకలు సాగించినా లేదా ఆ మూల బావి తవ్వించినా యజమాని మానసిక సమస్యల బారిన పడటం, శాంతి కోల్పోవటం జరుగుతుంది.
 • తూర్పు ప్రహరీ గోడకు ఇల్లు కలిపి మూయగట్టటం, తాకేలా కట్టకూడదు. అలాచేస్తే యజమాని, ఆ ఇంటి తొలి సంతానం లేదా పెద్ద కుమారుడికి లేనిపోని సమస్యలు వస్తాయి.
 • ఉత్తరం ప్రహరీకి ఆనించి ఇల్లు కట్టినా లేదా ఉత్తరం గోడ హద్దుగా ఎలాంటి నిర్మాణం చేసినా ఇల్లాలు ఆర్థిక పరమైన చిక్కుల్లో పడే సూచన ఉంది. ఇంట్లో ఉన్న గర్భవతులకు గర్భస్రావం అయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది.
 • ఇంటి ఫ్లోరింగ్ దక్షిణం, పడమర వైపు ఎత్తుగానూ, తూర్పు, ఉత్తరం వైపు పల్లంగానూ ఉండాలి. ఈ విషయంలో తేడా జరిగితే యజమాని వ్యసనాలకు బానిస కావటమే గాక ఎప్పుడూ రోగంతో బాధపడుతుంటారు.
 • ఏ ఇంటిలోనైనా దక్షిణ నైరుతి, ఉత్తర వాయవ్యం, పశ్చిమ నైరుతి దిశలలో దోషాలుంటే ఆ ఇంట కాపురముండేవారు తగాదాలు, శత్రుత్వం, ప్రాణభయం వంటి సమస్యలతో సతమతం అవుతారు.
 • పిల్లలు ఇల్లు విడిచి వెళ్ళిపోవటం, ఎవరూ ఊహించని రీతిలో ప్రేమ వివాహాలు చేసుకొని తర్వాత ఇబ్బందులు పడటం వంటి ఇబ్బందులు ఎదురైతే ఆ ఇంటి వాయవ్య, ఈశాన్య భాగాల రెండింటా సమస్య ఉన్నట్లు అర్థం చేసుకోవాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE