వాస్తు గృహ నిర్మాణాన్నే గాక ఇంటిలోని వస్తువులు ఎక్కడ, ఎలా అమర్చుకోవాలని కూడా సూచిస్తుంది. వాస్తు నిర్దేశిత నియమాలను పాటించటం వల్ల ఇంట్లో సానుకూల శక్తి తరంగాలు ప్రసరించి శుభాలు చేకూరతాయి. ఈ విషయంలో వాస్తు శాస్తవ్రేత్తలు చెబుతున్న మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

 • ఇంట్లో ఉదయం పూట సూర్య కిరణాలు పడేలా ఉంటే మంచిది. ఇప్పుడు ఎక్కువ మంది ఫ్లాట్లలో నివాసం వుంటున్నారు గనుక అది సాధ్యం కాకున్నా కనీసం గాలి, వెలుతురు ధారాళంగా ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో ఏ గదిలోనూ దీపం లేకున్నా పగలు చీకటిగా ఉండకూడదు.
 • హాల్ లో సోఫాలు, కుర్చీలుపడమర లేక దక్షిణ దిక్కులో వేసుకోవాలి. కూర్చునే వారు తూర్పు లేక ఉత్తర ముఖంగా ఉండాలి. అక్వేరియం డ్రాయింగ్‌ రూంలో ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య మూల అమర్చుకోవాలి.
 • దేవుని ఫోటోలు, విగ్రహాలు పూజాగదికి మాత్రమే పరిమితం చేయటం మంచిది. బెడ్‌రూంలో వీటిని పెట్టొద్దు. ఇంటిగదుల్లోని ఈశాన్య మూలల్లో భారీ శిల్పాలను పెట్టకూడదు. అదేవిధంగా డ్రాయింగ్ రూంలో ఉదయిస్తున్న సూర్యుడు, నదీ ప్రవాహాలు, జలపాతాలు, ఆహ్లాదం కలిగించే ఇతర ప్రకృతి దృశ్యాల చిత్రాలను పెట్టుకోవచ్చు.క్రూర జంతువులు, యుద్ధ సన్నివేశాల చిత్రాలు మాత్రం వద్దే వద్దు.
 • ఇంటికి బయటి గోడలు, ప్రహరీకితెలుపు రంగు మంచిది. లోపలి గదుల్లోలేత నీలం, ఆకుపచ్చ, ఊదా, క్రీమ్వంటి రంగులు వాడాలి. ఇంట్లోని గోడలకు పొరబాటున కూడా ఎరుపు, నలుపు రంగులు వద్దు.
 • బెడ్‌రూం తలుపులు, కిటికీలకు లేతరంగు కర్టెన్లు వాడాలి. ఎరుపు, నలుపు రంగులు వాడొద్దు. హాల్ లో మాత్రంముందురు రంగు కర్టెన్లను వాడొచ్చు.
 • ఇంట్లో మొజాయిక్‌, సెరామిక్‌ టైల్‌, మార్బుల్‌ ఫ్లోరింగ్‌ వేసేటప్పుడు పూజ గదికి తెలుపు రంగు ఫ్లోరింగ్కు, మిగిలిన గదుల్లో లేత రంగు ఫ్లోరింగ్ ఉండేలా చూసుకోవాలి.
 • ఆగ్నేయంలోఉండే వంటగదిలో వాడే గ్యాస్‌ స్టవ్,ఒవెన్లు, మైక్రోవేవ్‌ వంటి ఉపకరణాలు ఆగ్నేయమూలన అమర్చుకోవాలి. కూలర్‌, ఎసి, ఫ్రిజ్ తదితరాలను గదిలో వాయువ్య మూలన పెట్టుకోవాలి. వీలున్నంత వరకువిద్యుత్‌ ఉపకరణాలను ఈశాన్య దిక్కున పెట్టకుండా చూసుకోవాలి.
 • ఉత్తరం కుబేర స్థానం గనుక ఇంట్లో విలువైన ఆస్తి పత్రాలు, ఆభరణాలు, నగదు దాచే బీరువాలునైరుతి గదిలో ఉత్తరం ముఖంగా పెట్టుకోవాలి.
 • వంటింట్లో లేదా హాల్లో డైనింగ్‌ టేబుల్‌ వేసుకునేటప్పుడు వాయువ్య దిక్కులో ఉండేలా చూసుకోవాలి.
 • పిల్లల గదిలోవారు చదువుకునే టేబుల్‌ను ఉత్తర లేదా తూర్పు దిక్కున వేసుకోవాలి.
 • గదిలో ఉత్తరం లేదా తూర్పు గోడకు అద్దాన్ని పెట్టుకోవాలి. పడక గది, స్టడీ రూంలోనూ అద్దం వద్దు.
 • ఇంట్లో మొక్కలు పెంచుకునే వారు ముళ్ళు లేని వాటినే ఎంపిక చేసుకోవాలి. అలాగే ఇంటికి ఈశాన్య మూల పెద్ద మొక్కలను పెట్టకపోవడమే మంచిది.
 • పైకప్పు మరీ ఎత్తుగా ఉండరాదు. అందం కోసం చేయించే సీలింగ్ సైతం చదరంగా ఉండటమే మంచిది. ఇంటికిప్రహరీ రక్షలాంటిది. అన్నివైపులా ప్రహరీ కట్టే స్థోమత లేనివారు కనీసం దక్షిణం, పడమర దిక్కుల్లోనైనా తప్పక ప్రహరీ కట్టాల్సిందే.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE