రోజంతా ఎన్నో ఒత్తిళ్ల మధ్య పనిచేసి అలసిపోయే మనిషి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకొనే ప్రదేశమే పడకగది. కనీసం 6 నుంచి 7 గంటలపాటు ఒకేచోట మనిషి సమయాన్ని గడిపేది కూడా పడకగదిలోనే. ఇంత ముఖ్యమైన పడకగదిలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నప్పుడే కంటినిండా నిద్రతో బాటు దాంపత్యజీవితం కూడా బాగుంటుంది. పడకగదిలో సరిగా నిద్రపట్టకపోవటం, అకారణంగా దంపతుల మధ్య మనస్పర్థలు రావటం వంటి సమస్యలు ఎదురవుతాయన్న వారు ఒకసారి తమ పడకగది వాస్తును, పలు ఇతర అంశాలను పరిశీలించుకొని, అందుకు తగిన మార్పులు, చేర్పులు చేసుకోవటం ఎంతైనా అవసరం.

వాస్తు సూచనలు

 • పడకగది దీర్ఘ చతురస్ర లేదా చతురస్రాకారంలో ఉండేలా చూసుకోవాలి. ఇలావుంటే దంపతుల మధ్య అనురాగం వికసిస్తుంది.
 • పొరబాటున కూడా పడకగదిలో అక్వేరియం, పూలకుండీలు, దేవుడి బొమ్మల వంటివి పెట్టొద్దు.
 • వాస్తు ప్రకారం పడకగదిలో అద్దం ఉండకూడదు. దీనివల్ల దంపతుల మధ్య అపార్ధాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే ఆ గదిలో అద్దం ఉంటే రాత్రివేళ దానిమీద వస్త్రాన్ని కప్పాలి.
 • పడకగదిలో వాడే ఎలక్ట్రానిక్ వస్తువులను ఆగ్నేయ మూలన అమర్చుకోవాలి.
 • కలపతో చేసిన మంచం మీదే పడుకోవాలి. ఇనుప మంచాలు శ్రేయస్కరం కాదు. గది సైజుకు తగిన మంచం ఎంపిక చేసుకోవాలి.
 • పడకగది నైరుతిమూలలో మంచం అమర్చుకొని దక్షిణం లేదా పడమర వైపు తలపెట్టి నిద్రించాలి.

ఇతర నియమాలు

 • పడకగదిలో టీవీ, కంప్యూటర్ అమర్చుకోవద్దు. దీనివల్ల టైం ప్రకారం నిద్రించటం సాధ్యం కాదు.
 • పడకగదిలోనే బాత్ రూం కూడా ఉంటుంది గనుక తేమ చేరే అవకాశం ఉంటుంది. అందుకే పగటిపూట కనీసం 2 గంటల పాటు పడకగది కిటికీలు, తలుపులు తీసి గాలి, వెలుతురూ వచ్చేలా చూడాలి.
 • రంగులకు మనసును ప్రభావితం చేసే శక్తి ఉంటుంది. అందుకే పడక గది గోడలకు ఆహ్లాదాన్ని కలిగించే లేత నీలం, ఆకుపచ్చ, గులాబీ, ఓ మాదిరి తెలుపు రంగులు వేసుకోవాలి. పడకగది లోపలి గోడలకు పొరబాటున కూడా ముదురు రంగులు వాడొద్దు.
 • పడకగదిలోకి అడుగుపెట్టగానే మనసుకు హాయి కలిగించే చిత్రాలు కనిపించేలా చూసుకోవాలి. ఫ్లవర్ వాజ్ పెట్టుకొని రోజూ తాజా పువ్వులు అమర్చుకుంటే బాగుంటుంది.
 • మంచం మీది దుప్పట్లు, దిండు కవర్లు తరచూ మార్చుతూ ఉండాలి.
 • నిమ్మనూనెలో 2 చుక్కల వేపనూనె వేసి ఓ మూల రాత్రిపూట దీపం వెలిగిస్తే మంచి సువాసన వస్తుంది. ఆరోగ్యపరంగానూ ఇది మంచిది. ఈ వాసనకు దోమలు కూడా చేరవు.
 • పడకగదిలో పైకప్పుకు పెట్టే దీపాలు తగినంత దూరంలో ఉండేలా చూసుకోవాలి. అన్నీ ఒకేచోట ఉంటే కాంతి ఎక్కువై నిద్ర చెడిపోయే ప్రమాదం ఉంటుంది. వెలుతురును అవసరాన్ని బట్టి మార్చుకునే దీపాలు ఎంపిక చేసుకోవాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE