• HOME
  • వాస్తు
  • ఆగ్నేయం బాగుంటే అంతా బాగున్నట్టే

 పంచభూతాల్లో అగ్ని ఒక ప్రధాన శక్తి. తూర్పు, దక్షిణ దిక్కులు కలిసే ఆగ్నేయ మూలకు పాలకుడు అగ్నిదేవుడు కాగా అధిపతి రాక్షస గురువైన శుక్రుడు. రాక్షసుల వేగము, అగ్నియొక్క ప్రచండ శక్తి కలిసి ఉండే స్థానమైన ఆగ్నేయ మూలన చేపట్టే ఎలాంటి నిర్మాణాల విషయంలోనైనాగృహస్తులు వాస్తు నిర్దేశించే అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. అగ్ని రూపమైన వెలుతురు ప్రాధాన్యాన్ని గుర్తించే ఉదయాన్నే సూర్యకాంతి వచ్చేలా తలుపులు, కిటికీలు తీయటం ,సాయంత్రం పూర్తిగా చీకటి పడక ముందే దీపాలు వెలిగించటం వంటి పద్ధతులు పూర్వం నుంచే ఏర్పడ్డాయి. ఈ మూలన జరిగే వాస్తు విరుద్ధమైన నిర్మాణాల వల్లగృహస్తు పలు ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆగ్నేయ మూలకు సంబంధించి వాస్తు నిర్దేశించే కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. 

ప్రాతిపదికలు 

వెలుతురు చైతన్యానికి ప్రతీక. అందుకే వేదకాలంలో ప్రతి ఇంటా రోజూ యజ్ఞం చేయటం ద్వారా పరిసరాల్లో చేరిన ప్రతికూల శక్తులు, తరంగాలను ఏరోజుకారోజు వదిలించేవారు. దీనివల్ల సానుకూల తరంగాల తీవ్రత పెరిగి మానసిక ఉల్లాసంతో ప్రజలు హాయిగా జీవించేవారు. యజ్ఞానికి వాడే సుగంధ ద్రవ్యాలు, పూజ చివర వెలిగించే కర్పూరం కారణంగా అక్కడి వాతావరణంలోని సూక్ష్మ క్రిములు నశించటమే గాక, వాటి కారణంగా వచ్చేసువాసనకు మానసిక ప్రశాంతత, సంతోషం కలిగేది. 

దీపపు వెలుతురుకు వాతావరణంలోని హానికారక బ్యాక్టీరియాను నాశనం చేసే శక్తితో బాటుసానుకూల తరంగాలను ఇంట్లోకి ఆకర్షించే ప్రత్యేక లక్షణం కూడా ఉంటుందని వాస్తు నిర్దేశిస్తోంది. అందుకే రోజూ ఇంట్లో నెయ్యి లేక నువ్వుల నూనెతో దీపారాధన చేస్తారు. 

ఇంటి ఆగ్నేయ మూల వంటగది ఉండాలని, ఆ గదిలోఆగేయ మూలన పొయ్యి పెట్టుకొని అక్కడే వంట చేయాలని, ఇక్కడ తయారైన ఆహారం తినటం వల్ల ఆ గృహస్తుల ఆరోగ్యం బాగుంటుందని వాస్తు సూచిస్తుంది. 

చైనా వారి ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారం ఇంటి దక్షిణ, ఆగ్నేయాల్లో ఎరుపు రంగు కొవ్వొత్తులను వెలిగిస్తే ఆ ఇంట ఉండేవారికి కోరినంత సంపద, మంచి ఆరోగ్యం, ఎంతో పేరు ప్రఖ్యాతులు సిద్ధిస్తాయి. 

జాగ్రత్తలు

  • తూర్పు ఆగ్నేయంలో తలుపు ఉన్న ఇంట్లో 2వ కుమారుడికి, ఆ తలుపు గుండా నదవటం వల్ల యజమానురాలికి సమస్యలు రావచ్చు. ఈ ఇంటికి చోర భయము, అగ్నిభయమే గాకకోర్టు వ్యాజ్యాలు, జైలుశిక్ష వంటి ప్రతికూల ప్రభావాలూ ఉంటాయి. 
  • ఇంటి ఆగ్నేయ, నైరుతిమూల గదులుఒకే ఎత్తులో ఉండాలి. నైరుతి కంటే ఆగ్నేయపు ఎత్తు పెరిగినా లేక తగ్గినా భార్యాభర్తల మధ్య గొడవలు, ఏ పనీ కాకపోవటం, పదే పదే గర్భస్రావం కావటం, డబ్బు నష్టం, మోసపోవడం, పెళ్ళైన కూతురు పుట్టింటికి చేరటం వంటి సమస్యలు రావచ్చు.
  • ఆగ్నేయ మూల వంట చేసేటప్పుడు.. తూర్పు అభిముఖంగా నిల్చుని వంట చేయాలి. ఎట్టి పరిస్థితిలో ఉత్తర ముఖంగా నిలవరాదు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE