ఇంటిలోనైనా, కార్యాలయంలోనైనా తగినంత కాంతి ఉంటేనే సౌకర్యంగా ఉంటుంది. అయితే సరైన కాంతి ఉన్నచోటే శక్తితో బాటు సానుకూల వాతావరణం ఉంటుందని ఫెంగ్ షుయ్ వాస్తు చెబుతోంది. కాంతి విషయంలో ఫెంగ్ షుయ్ వాస్తు సూచించే కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం.

  • మన ఇల్లైనా, కార్యాలయమైనా వెలుతురు పరిమితంగా ఉండాలి. ఎక్కువ కాంతి అశాంతికి, సమస్యలకు దారితీస్తుంది.
  • కాంతి కళ్ళు మిరుమిట్లు గొలిపేలాగా ఉన్నప్పుడు అక్కడ బలమైన శక్తి తరంగాలు ప్రసారమై సానుకూల వాతావరణాన్ని దెబ్బతీస్తాయి.
  • ఫెంగ్ షూ సిద్ధాంతాల ప్రకారం కాంతి సమతుల్యం చాల ముఖ్యం. ఇందుకోసం గదిలోనైనా, బయటైనా వీలైనంత వరకు 2 లైట్లను ఉపయోగించాలి. దీనివల్ల కాంతిని సమతుల్యం చేసుకోవచ్చు.
  • కాంతి గదిలో ఒకే చోటునుంచి గాక వేర్వేరు ప్రాంతాల నుంచి, వేర్వేరు తీవ్రతలతో ప్రసరించాలి. అందుకే ఒకే పెద్ద లైటుకు బదులు పైకప్పులోనే పలు లైట్లను అమర్చి కాంతి గదంతా పడేలా చేసుకోవాలి. అవసరమైతే మూలల్లోనూ లైట్లను పెట్టుకోవాలి.
  • ప్రతి గదిలో సూర్యకాంతి పడేలా చూసుకోవాలి. కృత్రిమ కాంతి కన్నా దీని శక్తి వాండ్ల రెట్లు ఎక్కువని గుర్తించాలి.
  • ఫెంగ్ షూ సూత్రాల ప్రకారం గొప్ప కాంతినిచ్చే ఫ్లోరోసెంట్ కాంతిని వీలైనంత తగ్గించాలి. తప్పక వాడేవారు ఆ దీపాలను అద్దం ముందు వచ్చేటట్లుగా చూడాలి. దీనివల్ల ఆ కాంతి అద్దం మీదుగా పరావర్తనం చెంది గదిలో ప్రసరిస్తుంది.
  • సుగంధ నూనె దీపాలు, కొవ్వొత్తుల కాంతితో సానుకూల శక్తి తరంగాలను ప్రసారం జరుగుతుంది గనుక వాటిని ఎక్కువగా వాడాలి. Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE