29th December To 05th January
చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు నెరవేరుతాయి. వారం ఆరంభంలో కార్య సిద్ధి, వారాంతంలో విందులు, వినోదాలతో కాలం గడుపుతారు. వారం మధ్యలో జాగ్రత్తగా ఉండాలి. కార్య సాధనలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా ముందుకుసాగి విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగులకు పై అధికారుల సాయం అక్కరకొస్తుంది. మానసిక ఒత్తిడిని దరిచేరనీయవద్దు. వస్త్ర, నగల వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ నాయకులకు చికాకులు తప్పవు. బంధువుల వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. గణపతి ఆరాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది.